Breaking News

లిక్కర్‌ కేసుతో నాకు సంబంధం లేదు

Published on Fri, 01/23/2026 - 07:37

సాక్షి, హైదరాబాద్‌: ‘లిక్కర్‌ కేసుతో నాకు సంబంధం లేదు. లిక్కర్‌ స్కామ్‌ గురించి నాకు తెలియదు. జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసి అలాంటిది ఏమీ జరిగి ఉండదు. జగన్‌ మోహన్‌రెడ్డికి తెలిసి అటువంటిది జరిగితే ఆయన ఊరుకోరు ’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. 

లిక్కర్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు ఆయన విచారణ ముగిసింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

విశాఖపట్నంలో తాను ఆస్తులు కూడగట్టుకున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ ఒక నీచమైన రిపోర్ట్‌ తయారు చేసిందన్నారు. అందులో పేర్కొన్న ఆస్తులన్నీ తనవే అని చంద్రబాబు, సిట్‌ చీఫ్‌ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని చాలెంజ్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఉత్తమ ప్రధానమంత్రిగా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతీ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మెజార్టీ ప్రజలు మోదీని అభినందిస్తున్నారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధ్వానంగా ఉందని, పక్షపాత ధోరణి, కులవివక్ష, అసమర్థతతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)