Breaking News

ఇన్‌స్టా లవ్‌.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు

Published on Sat, 01/25/2025 - 07:59

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇంస్టాగ్రామ్‌లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి  వచ్చింది. నార్త్‌జోన్‌ ఏసీపీ స్రవంతిరాయ్‌ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. 

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. 
న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్‌లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు.

 తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్‌ యువరాజ్‌నాయక్‌(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు.  

గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. 
ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్‌నగర్‌ సీఐ          వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్‌ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్‌ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది.  

మరో కేసు కూడా.. 
అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్‌బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్‌ తెలిపారు.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు