Breaking News

అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..

Published on Wed, 01/07/2026 - 10:35

విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్‌లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్‌ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు.   

ఇటీవలే రెండో పెళ్లి..   
ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘు అలియాస్‌ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్‌ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్‌ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తపై భార్య దాడి 
బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్‌) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్‌ అస్గర్‌ చోరీలు, డ్రగ్స్‌ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్‌ అస్గర్‌ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అస్గర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)