Breaking News

చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు బలయ్యారు: మంత్రి రజనీ

Published on Sun, 01/01/2023 - 21:20

సాక్షి, గుంటూరు: గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి విడదల రజనీ. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి. 

‘చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేశారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్‌ ప్రచారాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి జనాలను మభ్యపెట్టి ఇక్కడి తీసుకొచ్చారు. గోరంత ఇచ్చి కొండంత అని చెప్పుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. కేజీ కందిపప్పు, అరకేజీ నూనె ఇచ్చి ఏదో అన్ని సరుకులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. మొన్న కందుకూరులో 8 మంది మరణించారు. ఇప్పుడు గుంటూరులో ముగ్గురు. ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి ’అని టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి విడదల రజనీ. 

ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు కావాల్సిన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు మంత్రి రజనీ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అదనపు డాక్టర్లను తరలించామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)