Breaking News

వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం 

Published on Mon, 08/14/2023 - 06:27

నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు.

అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్‌ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వ­నాశ­నౖ­మెం­దన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్‌ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)