Breaking News

అంతర్మధనంలో అధికార టీడీపీ

Published on Fri, 10/10/2025 - 06:53

సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్‌సీపీ కేడర్‌ సైతం విస్తుపోయే రేంజ్‌లో సూపర్‌ సక్సెస్‌ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).

జగన్‌ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్‌పోస్టులు, బారికేడ్లను జగన్‌ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది.  జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్‌ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. 

తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్‌ సుధాకర్‌ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్‌ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్‌ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్‌ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..

చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్‌ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్‌ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..

ఊహించని రీతిలో జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్‌ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.

క్లిక్‌ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్‌ కోసం జన సునామీ.. చూశారా?

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)