Breaking News

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనాలు బంద్‌

Published on Sat, 12/27/2025 - 09:03

సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవింద మాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో, టీటీడీ ఒంటెద్దు పోకడలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

వివరాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్ళే సర్వ దర్శనం నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్టు తెలిపింది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. టికెట్‌ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది.

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను, నడిచి వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దిన పత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అలాగే, గోవింద మాల ధరించిన భక్తులకు కూడా సర్వదర్శనం అనుమతిలేదని తెలిపింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాగా, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆఫ్ లైన్‌లో టికెట్లు కేటాయింపు ద్వారా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే, వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్‌లైన్‌పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలా ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)