తిరుమలలో ప్రోటోకాల్‌ రగడ.. నారాయణ స్వామికి అవమానం!

Published on Thu, 07/16/2026 - 11:15

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కె. నారాయణ స్వామి టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్‌ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని.. ఇది తనను అవమానించినట్లేనని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం. నాకు ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారు. ఇది అవమానంగా భావిస్తున్నాను” అని నారాయణ స్వామి అన్నారు. అలాగే తిరుమలలో వైఎస్సార్సీపీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.

అదే సమయంలో టీటీడీలో వీఐపీ సంస్కృతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి.. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండకూడదు” అని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అదే సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. 

ప్రోటోకాల్‌ పేరుతో ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో సాధారణ భక్తుల దర్శన సమయం మరింత ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణలో పోలీసులు, విజిలెన్స్‌ విభాగం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు, నీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)