Breaking News

మళ్లీ ‘అవ్వ’స్థలు తప్పవా! 

Published on Mon, 04/01/2024 - 03:11

నక్కపల్లి(అనకాపల్లి జిల్లా):  రేపటి నుంచి పింఛన్‌ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందేమోనని మదనపడుతున్నారు. ఇదే విషయంపై తన గోడు వెలిబుచ్చారు ఓ అవ్వ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చినదొడ్డిగల్లుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కురందాసు వృద్ధురాలు ఎరకమ్మ ఇంటికి వెళ్లారు.

పింఛను వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎరకమ్మ బదులిస్తూ ‘‘ఇప్పటివరకు  ప్రతినెలా ఒకటో తేదీ పొద్దుపొద్దునే వలంటీరు వచ్చి డబ్బులిస్తున్నాడు. రేపు ఒకటోతేదీ కదా పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మేమే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంట. వలంటీర్లను తీసేశారంట నిజమేనా బాబూ! ఈ వయసులో సచివాలయం వరకు వెళ్లి తెచ్చుకోలేమయ్యా.. ఇంటికొచ్చి ఇచ్చేటట్టు చూడయ్యా’’ అంటూ వేడుకుంది.

ముత్యాలనాయుడు స్పందిస్తూ చంద్రబాబు వల్లే ఎన్నికల అధికారులు వలంటీర్లను రెండునెలలపాటు ఆపారు. జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్‌ ఇస్తారు. మీరంతా జగన్‌కే ఓట్లు వేయాలని’’ అని వివరించారు. అవ్వ మాట్లాడుతూ ‘‘నా ఓటు జగన్‌బాబుకే కొడుకా’’ అని వెల్లడించింది. అదే గ్రామంలో అప్పారావు అనే వృద్ధుడూ పింఛన్‌ ఇంటికే తెచ్చివ్వాలని కోరాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)