Breaking News

బాబూ.. జీతాలెప్పుడిస్తారు?

Published on Mon, 01/06/2025 - 05:10

సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 

ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్‌ అమరావతి 
జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి బడ్జెట్‌లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు. 

వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్‌వో సంఘం  
గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో సేవలు అందించే తమకు డిసెంబర్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌(సీహెచ్‌వో) అసోసియేషన్‌ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.  

ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్‌ 
ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్‌) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్‌లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్‌ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్‌ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.     

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)