టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం: వరుదు కళ్యాణి

Published on Thu, 11/27/2025 - 11:17

సాక్షి, విశాఖ: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని, ఇందుకు మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ చేసిన నిర్వాకమే నిదర్శనమని వైఎస్సార్ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి  ఎద్దేవా చేశారు. సంధ్యారాణి పీఏ సతీష్ ఒక మహిళను పక్కలోకి రావాలని వేధించాడని, ఆమె నుంచి ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు.

బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమంటున్నాడని, ఆమెను వేధించిన పీఏకు మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తున్నారని కళ్యాణి ఆరోపించారు. మంత్రి పీఏపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. కాగా బాధితురాలు మంత్రి లోకేష్ కు సతీష్‌పై ఫిర్యాదు చేసిందని, అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పీఏ కు సపోర్ట్ చేసిన మంత్రి సంధ్యారాణిని వెంటనే బర్త్ రఫ్ చేయాలని కల్యాణి డిమాండ్‌ చేశారు. మంత్రి పీఏ మహిళలను వేధిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళా రక్షణ అనేది కేవలం మాటలకే పరిమితమా? ఒక మహిళను మంత్రి పీఏ వేధింపులకు గురి చేస్తుంటే, హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని కల్యాణి నిలదీశారు. వెంటనే మంత్రి పీఏ సతీష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 



ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)