Breaking News

మహానాడు ఎఫెక్ట్‌.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

Published on Thu, 05/29/2025 - 10:42

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. 

మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్‌ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్‌’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి  హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.

మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. 

ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్‌ స్పీచ్‌.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)