Breaking News

కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..

Published on Fri, 06/20/2025 - 06:20

సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 

కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. 

⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ షేక్‌ అమీనుద్దీన్‌ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్‌ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్‌ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్‌మెన్‌ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్‌విత్‌ 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

⇒ వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున  ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్‌ ర్యాలీలు చేశారని వైఎస్సార్‌ సీపీ నేత గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్‌ ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బా­రికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. 
రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్‌ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్‌తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. 
 


ఫ్లెక్సీలు ప్రదర్శించారని... 
టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్‌ టీడీపీ మైనార్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు.  

⇒ వైఎస్‌ జగన్‌ పర్యటనలో అభిమానులు గజ్జ­ల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇ­బ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూ­ర్‌­బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మ­రో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్‌ ఆప­మన్నందుకు గుర్తుతెలియని నలుగురు త­నౖ­పె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)