Breaking News

పులివెందులలో టీడీపీ నేతల గూండాగిరి

Published on Thu, 11/05/2026 - 08:50

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల గూండాగిరి కొనసాగుతోంది. వీరికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. లింగాల మండలం పార్న పల్లి వద్ద ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్సీపీ ఏజెంట్లను టీడీపీ గుండాలు అడ్డుకుంటున్నారు. దీనికితోడు ఏజెంట్ల పత్రాలను చించేస్తున్నా, పోలీసులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేతలు బయటి వ్యక్తులను భారీగా మోహరించినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. 

కడప జిల్లా పెద్దముడియం మండలం జై. కొట్టాలపల్లిలో ఎంపీపీ స్కూల్‌లో పోలింగ్ కేంద్రం  చుట్టూ  టీడీపీ నేతలు మోహరించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు వెనక్కి పంపుతున్నారు. అలాగే వైఎస్‌ఆర్సీపీ ఏజెంట్స్ బయటకు పంపివేసిస్తూ, పచ్చ మూకలు వారిపై దాడికి యత్నిస్తున్నాయ. తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట ఊరి నుంచి వచ్చిన టిడిపి గుండాలు ఓటర్లను అడ్డుకుంటున పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని పోలీసులు సమక్షంలో కూటమి నేతలు ఓట్లు వేసుకుంటున్నారు. 

పల్నాడు జిల్లా గురజాల మండలంలో పల్లెగుంట, గంగవరం, పులిపాడు, దైద ,తేలుకుట్ల, గొట్టిముక్కల,సమాధానం పేట కొత్త అంబాపురం, గోగులపాడు,బోదవాడ, గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలీసులు, తెలుగుదేశం నేతలు బయటకు పంపించేస్తున్నారు. గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ కీలక నేతలను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్లో అక్రమంగా గురజాల సీఐ మురళి నిర్బంధిస్తున్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)