Breaking News

Singer Mangli: పాట పాడలేదని ఇంత పగనా?

Published on Thu, 02/06/2025 - 07:14

అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్‌ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్‌ జగన్‌ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్‌. 

 

శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్‌ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్‌ చేస్తోంది. 

చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్‌నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంగ్లీ  టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)