Breaking News

తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడు

Published on Sat, 09/13/2025 - 18:51

సాక్షి, విజయవాడ: తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్‌ నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుడిని చేసిన ప్రభుత్వం.. గతంలో బదిలీ చేసింది.

జనవరి 9న  వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడికి మళ్లీ అదే పోస్టింగ్‌ను సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తిరుపతి కోసం సుబ్బారాయుడిని మళ్లీ ఏపీకి తెచ్చిన చంద్రబాబు.. హిందు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా రీపోస్టింగ్ ఇచ్చారు.

కాగా, తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు.

భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే గతంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి తెర తీశారనే విమర్శలూ ఉన్నాయి. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీ పోస్టింగ్‌ ఇచ్చారు.

 

 

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)