Breaking News

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం

Published on Wed, 12/17/2025 - 08:33

ఎచ్చెర్ల : రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్‌ చాన్స్‌లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్‌ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్‌లో ఆరోపించారు.

 స్కాలర్‌షిప్‌ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్‌లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్‌ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు.

 మెయిల్‌ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్‌ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేజీవీడీ బాలాజీ తెలిపారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)