విశాఖలో విషాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Published on Fri, 05/02/2025 - 12:35

సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్‌కు గురై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్‌లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

మరో విషాద ఘటనలో..
ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్‌ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)