Breaking News

ఓటు వేయకుండా విధులు

Published on Thu, 11/05/2026 - 07:40

అనంతపురం ఎడ్యుకేషన్‌/కళ్యాణదుర్గం రూరల్‌:  ఎన్నికల విధుల పేరుతో సచివాలయ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు రాత్రి హడావుడిగా ‘ఎన్నికల విధుల’ ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. పోలింగ్‌ జరిగే ప్రతి కేంద్రంలో క్యూలైన్‌ నిర్వహణ కోసం ఒక్కో సచివాలయ ఉద్యోగిని నియమిస్తూ అనంతపురం రూరల్‌ ఎంపీడీఓ దివాకర్‌ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

 మరుసటి రోజు ఉదయం 6 గంటలకే కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనూ పోలింగ్‌కు ముందు రోజు సాయంత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో విధుల ఉత్తర్వులు పంపారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నారనే ఉద్దేశంతోనే తమపై ఇలా కక్ష కట్టి వ్యవహరిస్తున్నారనే అనుమానాలను కొందరు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల నిర్వహణలో సిబ్బంది సేవలు అవసరమే అయినప్పటికీ, విధుల కేటాయింపులో ముందస్తు సమాచారం ఇవ్వడం, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అధికారుల బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)