Breaking News

ఏపీ మద్యం కేసు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Published on Wed, 10/15/2025 - 11:55

సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్‌ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. 

అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. 

ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్‌ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: లిక్కర్‌ కేసులో మోహిత్‌రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)