Breaking News

భాగ్యశ్రీని బండరాయితో మోది.. కిరాతకంగా హత్య!

Published on Tue, 11/03/2026 - 09:05

తిరుపతి రూరల్‌: నాయుడుపేట–పూతలపుట్టు జాతీయ రహదారికి ఆనుకుని తిరుపతి రూరల్‌ మండలం సి.మల్లవరం వద్ద హత్యకు గురైన యువతి ఆచూకీని పోలీసులు గుర్తించారు. మృతురాలు చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన భాగ్యశ్రీగా నిర్ధారించారు. తిరుపతి నగరంలోని ఎస్టీవీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ పీజీ హాస్టల్‌లో నివసిస్తూ ఎస్‌బీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల విభాగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా ఆమె పనిచేస్తున్నట్లు గుర్తించారు. 

గత నెల 30న భాగ్యశ్రీ ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయిందని, మరుసటి రోజు 31వ తేదీ రాత్రి హత్యకు గురైన యువతి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్, లక్ష్మీదేవి గుర్తించారు. అనంతరం తిరుపతి రూరల్‌ పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని పరిశీలించి యువతి ఒంటిపై ఉన్న దుస్తులు, నగలను చూసి ఆమె తమ కుమార్తె భాగ్యశ్రీ అని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

దర్యాప్తు ముమ్మరం 
హత్యకు గురైన భాగ్యశ్రీ ఉద్యోగం చేస్తున్న కార్యాలయంతో పాటు ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరించుకున్న పోలీసులు గత రెండు రోజులుగా కార్యాలయంలో విధులకు హాజరుకాకుండా ఉన్న వారి వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం. అయితే మృతురాలి సెల్‌ఫోన్‌ లభించలేదు. ఆమె నివాసముంటున్న పీజీ హాస్టల్‌ వద్దకు ఎవరెవ్వరు వచ్చి ఆమెను కలిసేవారు, 30వ తేదీ ఎన్నిగంటలకు పీజీ నుంచి బయటకు వెళ్లిందన్న వివరాలను కూడా అక్కడి సీసీ టీవీ పుటేజీ ద్వారా పోలీసులు సేకరించారు. ఈ కేసు మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని తిరుపతి రూరల్‌ సీఐ మద్దయ్యచారి తెలిపారు. 

ఇదీ చ‌ద‌వండి: అయ్యో మ‌ల్ల‌య్యా.. ఎంత పని జ‌రిగింద‌య్యా!  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)