Breaking News

రియల్ ఎస్టేట్ ఢమాల్.. కొనేది లేదు... అమ్మేది లేదు

Published on Thu, 03/06/2025 - 15:03

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్‌ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతినెలా బోలెడు లోటు కనిపిస్తోంది దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం.. కుదిరినన్నిచోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేసారు. భూముల ధరలు పెంచేశారు.. దీంతో పదివేలున్న గజం భూమి ఒకేసారి పదిహేను వేలు అయింది.. దానిమీద జరిగే క్రయవిక్రయాలమీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతుంది. బాబు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఆఫీసు మామూళ్లు చూసి జనం భీతిల్లుతున్నారు.

ఇసుక ధరలు.. గుండెలు గుభేల్
ఇదిలా ఉండగా ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక ప్రజలకళ్ళలో ఇసుక పోసింది. మారాజా అంటే మరి రెండు తన్నండి అన్నట్లుగా.. వైఎస్‌ జగన్ హయాంలో ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయ్.. మేమొస్తే ఫ్రీ ఇసుక అని నమ్మించి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండలనుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస ఐంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇదంతా కలిసి ప్రజలకు ఇసుక అనేది మహాప్రసాదం ఐంది. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి.. వ్యాపారం చేయడం గగనం అయిపోతోంది.

వెంచర్లమీద వాలుతున్న పచ్చ రాబందులు
రాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు వాతావరణం సరిగా లేదు. మొన్నటికిమొన్న  మద్యం వ్యాపారం మోసం లక్షల్లో అప్పులుచేసి లైసెన్సులు తీసుకుని షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వాలిపోయారు.. మాకు పావలా వాటా ఇస్తావా.. షాప్ మూసుకుని వెళ్ళిపోతావా అని బెదిరించారు. అనంతపురం.. తాడిపత్రి ప్రాంతాల్లో జెసి బ్రదర్స్ అయితే లైసెన్స్ దారులమీద చేసిన రుబాబు రాష్ట్రంమొత్తం చూసింది. ఇప్పుడు ఇదే సంస్కృతి రియల్ ఎస్టేట్ లోకి కూడా పాకింది. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి.. అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టిడిపి నేతలు వాలిపోతున్నారు. 

మాకు రౌడీ మామూలు కడితే సరేసరి.. లేదంటే ఆ భూములు వివాదాస్పదం అంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ తొమ్మిదినెలలుగా ఇంటి స్థలాలు.. అపార్టుమెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక.. వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. ఇదేకాదు చిన్నాచితకా పరిశ్రమలు నడిపేవారిపైనా తెలుగుదేశం నేతలు రుబాబు చేస్తున్నారు. దీంతో డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు - సిమ్మాదిరప్పన్న

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)