Breaking News

కదంతొక్కిన యువజనం

Published on Wed, 07/29/2026 - 05:01

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. 


టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు.
  

అందరి నోట అదే డిమాండ్‌ 

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్‌ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్‌ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్‌ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)