Breaking News

'స‌లార్' రిలీజ్‌: ప్ర‌భాస్ వీరాభిమాని మృతితో..

Published on Fri, 12/22/2023 - 11:19

శ్రీసత్యసాయి, సాక్షి: సలార్‌ సినిమా రిలీజ్‌ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్‌ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ట్ట‌ణ కేంద్రంలోని రంగా సినిమా థియేట‌ర్‌లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవ‌ర‌ణ‌లో సలార్ మూవీ బ్యాన‌ర్‌ కడుతున్నాడు. ఆ సమయంలో ప్ర‌మాదవ‌శాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగ‌లకు త‌గ‌ల‌డంతో షాక్‌కు గురై అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలాడు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని హాస్పిల్‌కి త‌ర‌లించ‌గా ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విష‌యం తెలుసుకున్న‌ కుటుంబీకులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 

మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేట‌ర్ వ‌ద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన‌ బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.

ఇవి కూడా చ‌ద‌వండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)