Breaking News

తుపాన్ల ప్రభావంపై ప్రధాని మోదీ ఆరా

Published on Thu, 11/05/2026 - 05:46

సాక్షి, అమరావతి: రాష్ట్రంపై అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం ఆయన ఫోన్‌ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుపాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావం.. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం  వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీనష్టం వాటిల్లిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

సీఎం ఏరియల్‌ వ్యూ 
మరోవైపు.. మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూలో పరిశీలించారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలకు వరద ప్రవాహాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ముంపు ప్రాంతాల్ని త్వరితగతిన క్లియర్‌ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన బుట్టాయగుడెం, వేలేరుపాడు, పోలవరం మండలం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)