Breaking News

పిఠాపురం.. పైగా పవన్‌ చేతిలో పనే.. అయినా సైలెన్స్‌!

Published on Tue, 09/23/2025 - 09:16

సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై  బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests). 

పవన్‌ చేతిలో పనే, కానీ.. 
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. 

సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్‌ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)