Breaking News

AP: ప్రాణం తీసిన పెన్షన్ తొలగింపు

Published on Tue, 08/19/2025 - 16:04

సాక్షి, కృష్ణా జిల్లా: పెన్షన్‌ తొలగింపుతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దివ్యాంగురాలు.. గుండెపోటుతో మృతి చెందింది. మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇటీవల పెన్షన్ల సర్వేలో దివ్యాంగురాలైన మేడం లక్ష్మి పెన్షన్‌ను తొలగించారు. పెన్షన్ తొలగించడంతో తీవ్ర మనోవేదనతో గత రాత్రి లక్ష్మికి గుండెపోటుకు గురైంంది.

పెదపూడి సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మాట్లాడుతూ.. ‘‘మా సచివాలయ పరిధిలో 113 పెన్షనర్లు ఉన్నారు. వారందరి పెన్షన్లను రీ వెరిఫికేషన్‌కు పంపించాం. 8 పక్షవాతం వచ్చిన వారి పెన్షన్లు ఉన్నాయి. వాటిని 6 వేల రూపాయల పెన్షన్‌లోకి మార్చారు. 34 మంది పెన్షన్ దారులను రిజెక్ట్ చేశారు. లక్ష్మి ఇంటికి పెన్షన్ రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వడానికి వెళ్లాను. పెన్షన్ రిజెక్షన్ లెటర్ ఇవ్వగానే కన్నీరు పెట్టుకున్నారు. నేను లక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. ఉదయం లక్ష్మి చనిపోయారని తెలిసింది’’ అని ఆమె తెలిపారు.

డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వికలాంగుల నిరసన
నంద్యాల జిల్లా: పెన్షన్ల తొలగింపుపై డోన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వికలాంగులు ఆందోళన చేశారు. అంగ వైకల్య శాతం తక్కువగా ఉందని నోటీసులు అందడంతో పింఛన్‌ లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు ఎటువంటి పరీక్షలు చేయకుండానే నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)