Breaking News

డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’

Published on Thu, 05/01/2025 - 05:02

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునహ్వార్మాణ కార్యక్రమం ఆహ్వానపత్రంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ ఆయన పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90శాతం ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది.  

మోదీ, బాబు పేర్లు మాత్రమే..! 
ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఆర్‌డీఏ నాలుగు పేజీల ఆహ్వానపత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ముద్రించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పేరు లేదు. ఈ ఆహ్వానపత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యులకు పంపించారు. ఆహ్వానపత్రికలో పవన్‌ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేనపార్టీ మిన్నకుండిపోయింది. 

పవన్‌ కళ్యాణ్‌ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు.  తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా? అంటూ పోస్టులు పెట్టారు. దీనికి టీడీపీ శ్రేణులూ కౌంటర్‌ ఇచ్చాయి. రెండుపార్టీల మధ్య సోషల్‌మీడియా వార్‌ జరుగుతోంది.

మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు  
ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఆహ్వానపత్రంలో మొక్కుబడిగా పవన్‌ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90శాతం పత్రికల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. 

ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రాధా­న్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్‌ కళ్యాణ్‌.. చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)