Breaking News

టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు

Published on Sat, 05/17/2025 - 05:28

సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులే లక్ష్యంగా ప్రారంభమైన వేధింపుల పర్వం.. మండల స్థాయి అధికారులకూ తప్పడం లేదు. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తనను వేధిస్తున్నారని, అసభ్య పదజాలంతో ఫోన్లో దూషించారని సాక్షాత్తు ఓ మండల మేజి్రస్టేట్‌ ఆవేదన వ్యక్తం చేయడం ఉద్యోగ వర్గాలను విస్మయపరుస్తోంది. ‘‘ఈ నెల 15న రాత్రి 21.59 నిమిషాలకు పార్వతీపురం ఎమ్మెల్యే తనకు వాట్సాప్‌ కాల్‌ చేసి, మహిళ అని చూడకుండా మాటలకు అందని పదజాలంతో నన్ను దూషించారు’’ అంటూ పార్వతీపురం ఎస్‌ఐకు స్థానిక తహసీల్దార్‌ వై.జయలక్ష్మి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటున్న లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది.

శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సంయుక్త కలెక్టర్‌ శోభికలను కలిసి కూడా తన ఆవేదన వినిపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడం.. ఆయన దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకూడదని అధికారులు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. ఇదే విషయమై తహసీల్దార్‌ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టకుండా తాను ఏ విషయమూ బయటకు చెప్పలేనని, తర్వాత తానే పిలిచి చెబుతానని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు విషయం పెద్దది కాకుండా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  

ఎమ్మెల్యే ఏమంటున్నారంటే.. 
ఈ ఘటనపై పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందించారు. తహసీల్దారు మీద అవినీతి ఆరోపణలు రావడం వల్లే అడిగినట్లు చెప్పారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల వద్ద నుంచి డిజిటల్‌ సిగ్నేచర్‌ కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్‌ చేసినట్లు తెలిసిందని, అందులో ఇప్పటికే రూ.2 లక్షలు కూడా తీసుకున్నట్లు పలువురు చెప్పారని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)