Breaking News

టీడీపీ సభల్లా పేరెంట్‌–టీచర్స్‌ సమావేశాలు

Published on Sat, 12/06/2025 - 09:56

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: పాఠశాలలు, విద్యార్థులు, విద్యా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన మెగా పేరెంట్‌–టీచర్స్‌ సమావేశాలు టీడీపీ సభల్లా మారాయి. రాజకీయ ప్రసంగాలకు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్‌పై పొగడ్తలకు పరిమితమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తొలి ప్రాధాన్యంతో పాటు మాట్లాడే అవకాశమివ్వాల్సిన చోట రాజకీయ నాయకులే అంతా ముందుండి నడిపించారు. మెగా పీటీఎం పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. 

పార్వతీపురం మన్యం జిల్లాలోని భామి­ని ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా అందించిన డబుల్‌ డెస్క్‌ బెంచీలకు ‘లీప్‌’ స్టిక్కర్లు అతికించారు. వాటిపైనే కూర్చు­ని సీఎం విద్యార్థులతో మాట్లాడారు. అన్ని చోట్లా కేవలం రాజకీయ ప్రసంగాలు, లోకేశ్‌ను మార్కెట్‌ చేయడమే ప్రధానంగా సమావేశాలే సాగాయి. 

గుంటూరు పట్టణంలో జరిగిన పీటీఎంలో వేదిక పైనా, కిందా టీడీపీ నాయకులే ఆక్రమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల పీటీఎంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని బూటుకాళ్లతో తన్నిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావును డీఈవో సస్పెండ్‌ చేశారు. కడపలోని గాం«దీనగర్‌ మున్సిపల్‌ హైసూ్కల్లో తల్లిదండ్రుల కోసం వేసిన కురీ్చల్లో టీడీపీ నేతలు కూర్చున్నారు.

పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు 
వైఎస్సార్‌ కడప జిల్లా కాశినాయనమండలంలోని నాయునిపల్లి ఎంపీపీ పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ నాగమునెమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తల్లిదండ్రులు రాకపోవడంతో టీడీపీ నేతలు బలవంతంగా పిలిపించారు. తిరుపతి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. 

తల్లిదండ్రుల కంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా చోట్ల 30 శాతం మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనలేదు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే రీతిలో సమావేశాలు కొనసాగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాక ఆలస్యం కావడంతో హిందుపురం టీడీపీ ఎమెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ప్రదర్శించారు.    
 
భోజనం బాగోలేదంటూ ఆగ్రహం 
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి జిల్లా పరిషత్‌ హైసూ్కల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం బాగుండటం లేదని, దీంతో పిల్లలు ఇళ్లకు వచ్చేస్తున్నారని చెప్పారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చక పోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్‌–టీచర్స్‌ సమావేశాన్ని బహిష్కరించారు. పాఠశాల గేటు మూసివేసి బయటే ఉండిపోయారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)