Breaking News

టీడీపీలో నారా లోకేష్‌ బర్త్‌డే చిచ్చు!

Published on Thu, 01/23/2025 - 11:56

అన్నమయ్య, సాక్షి:  టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ పుట్టినరోజు ఆ పార్టీలో చిచ్చురాజేసింది. తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్‌ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్‌ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం.  ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.

ఏం జరిగిందంటే..  తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌(Shankar) వర్సెస్‌ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి(dasaripalli Jai Chandrareddy) వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్‌ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్‌ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో..

ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్‌ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్‌ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)