Breaking News

ఒక్కసారి మాట్లాడతా అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటాడు: పేర్ని నాని

Published on Sat, 09/24/2022 - 15:06

సాక్షి, కృష్ణా జిల్లా: అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని.. అందుకే తన బినామీలతో చేయించే యాత్ర ఇది అని అన్నారు. ఈ యాత్రలో రైతులెవ్వరూ లేరని.. కేవలం చంద్రబాబు మనుషులే ఉన్నారని తెలిపారు. ప్రజాదరణ లేని టీడీపీ యాత్రకు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చ కండువా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారన్నారు. 

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకి పెడుతున్నాడు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొనట్లేదు. ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే వైఎస్సార్‌సీ లక్ష్యం. పేదల ఆర్థిక స్థితిగతిని మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న ఈ చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎంత మానసిక క్షోభ అనుభవించేలా చేసాడో తెలుసా. పార్టీ నుండి సస్పెండ్ చేసి, కనీసం చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటాడు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేసాడు. చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భయభక్తులు చూపించాడు' అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 

చదవండి: (విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్‌ ప్రతాపం)

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)