Breaking News

తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్‌ తలోమాట

Published on Thu, 01/09/2025 - 19:24

తిరుపతి : తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల వారికి తోచినట్లు  మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తలోమాట మాట్లాడారు.  ఇక్కడ వేర్వేరు అధికారులను టార్గెట్ చేశారు. 

అయితే ముందుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. కానీ పవన్‌ మాత్రం ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడుల తప్పుందని తేల్చేశారు. వారి‌మధ్య సమన్వయలోపం వలనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు, 

కానీ వేరే అధికారులదే తప్పంటూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్షవర్ధనరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్లు  వెల్లడించారు. ఇలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ల తలో  మాట్లాడటంపై  చర్చ జరుగుతుంది. 

పవన్‌ మాట్లాడుతూ..
ప్రమాద బాధితుల్ని పరామర్శించిన అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తిరుపతిలో తప్పు జరిగింది. టీటీడీలో ‍ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి  విఫలమయ్యారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి,ఛైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య సమన్వయ లోపం ఉంది. పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి’అని వ్యాఖ్యానించారు. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)