Breaking News

సంక్రాంతి సంబురాలు.. అడ్డంగా దోచేస్తున్న కూటమి నేతలు

Published on Fri, 01/16/2026 - 09:58

ఏపీలో సంక్రాంతి సంబురాలను కూటమి నేతలు పూర్తి జూదంగా మార్చేశారు. ప్రత్యేకించి.. టీడీపీకి చెందిన నేతలు ప్రజల పండుగను విపరీతంగా క్యాష్‌ చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆటలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో నడిపిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలను టీడీపీ, జనసేన నేతలు దగ్గరుండి నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. కూటమి నేతల ఆ దోపిడీ ఎలా ఉందంటే.. 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్‌ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్‌ చేయాలని కూడా ఆదేశించింది. కానీ.. కూటమి నేతలకు భయపడుతున్న పోలీసులు ఆ పక్కకు కూడా పోవడం లేదు. 

సీఎం సభ రేంజ్‌లో..
ఒక పక్క..  ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మీడియాను బరుల చుట్టుపక్కలకూ కూడా రానివ్వడం లేదు. ఆఖరికి.. సెల్‌ఫోన్‌లతో వీడియోలు తీయకుండా ప్రైవేట్‌ సైన్యాన్ని ఏరపాటు చేస్తున్నారు. వీఐపీలు రిఫ్రెష్‌ కావడానికి కారవాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట గుండాటతోపాటు మరికొన్ని ఆటలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తున్నారు. అలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.2000 కోట్లకు దాకా జూద క్రీడలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు.. 

ఏరులై పారతున్న..
మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గరే బెల్ట్‌ షాపులు వెలిశాయి. అవి వైన్‌ షాపులను తలపిస్తున్నాయి. కూటమి నేతలు, వాళ్ల అనుచరులే వాటిని నడిపిస్తున్నారు. మద్యం ప్రియుల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటూ లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారు. లిక్కర్‌ క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ.50 , బీర్ బాటిల్ పై రూ.100 వసూలు చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్‌ పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.

డాన్స్‌ బేబీ డాన్స్‌
ఇంకోవైపు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో రికార్డింగ్‌ డ్యాన్సులు చేయిస్తున్నారు. కూటమి నేతలైతే ఆ డ్యాన్సర్లతో కలిసి హుషారుగా గంతులేస్తున్నారు. కొందరైతే.. యువతులను దుస్తులు విప్పమంటూ ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో డాన్సర్లతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రధానంగా డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం సహ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా ఈ తంతు జరుగుతోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్‌ అనుచరుడు దగ్గురుండి మరీ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అశ్లీల వ్యవహారాలను అడ్డుకోవాల్సిన పోలీసులు పత్తా లేకుండా పోయారు. 

 

 

నెట్టింట చర్చ.. రచ్చ..
ఈ బాగోతాలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. కోడి పందేలు, గుండాట.. ఆ ప్రాంగంలోనే మందు బాబుల వీరంగం తాలుకా వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అశ్లీల నృత్యాలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నెట్టింట పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదే సమయంలో.. వీటి కోసం తెలంగాణ నుంచి భారీగా తరలి వస్తున్నారనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం సంబురాల పేరిట గబ్బు పట్టిస్తోందని పలువురు మండిపడుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)