Breaking News

బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..

Published on Tue, 12/16/2025 - 10:05

కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్‌ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్‌ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. 

మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్‌ స్టేషన్‌ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.  

పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి..  
కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్‌ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌