Breaking News

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ నేతల అక్రమాలు

Published on Sat, 11/07/2026 - 18:57

శ్రీ సత్యసాయి/కాకినాడ/అనంతపురం/ కృష్ణా జిల్లాలు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు వేళ బరితెగించారు. గోరంట్ల మండలం బూదిలి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 55 ఓట్లతో గెలుపొందగా, రీ కౌంటింగ్ జరపాలని మంత్రి సవిత వర్గీయులు గొడవ చేశారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. 

పిఠాపురం రూరల్ నర్సింగపురం-జమ్ముల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపుల్లోనూ అవకతవకలు జరిగాయి. కౌంటింగ్ అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాయుడు చాందినీ దేవి. నాలుగు కౌంటింగ్ బాక్సుల్లో ఒక బాక్స్‌కు కూడా సీల్‌ సరిగ్గా లేదు. చాందినీ దేవి అనుమానం వ్యక్తం చేసినా బాక్స్ తెరిచి అధికారులు ఓట్లు లెక్కించారు. దిక్కున చోట చెప్పుకో అంటూ తన పట్ల అధికారులు దురుసుగా వ్యవహరించారని చాందినీ దేవి ఆరోపించారు.

కల్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినా అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. రీ కౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారు చేస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కల్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో డిక్లరేషన్ ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషించారు.

మాడుగుల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే స్వగ్రామం వెన్నెలపాలెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పైల సత్యనారాయణ విజయం సాధించారు. సమీప కూటమి అభ్యర్థిపై 73 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నంద్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహానంది మండలం అబ్బిపురం ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నూర్ బాష గెలుపొందినా కూడా ఉదయం నుంచి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఆటంకం కలిగించటంపై శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్ అయ్యారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లడానికి బయలు దేరిన శిల్పచక్రపాణి రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉండటంతో టీడీపీ కుట్రలు చేసింది. తిరుపతి రూరల్ జడ్పీటీసీ కౌంటింగ్ గంటపాటు నిలిపివేశారు. వైఎస్సార్‌సీపీకి ఆధిక్యత వస్తుండటంతో పోలింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు టీడీపీ నాయకులు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్.జీ.ఎస్ ఆర్ట్స్ కాలేజీకు వచ్చి పోలింగ్ అధికారులతో మాట్లాడారు.

ఇదీ చదవండి: అందుకే నా జీవిత కథను నేనే చెప్పాలనిపించింది: సోనియా గాంధీ

కృష్ణా జిల్లాలోనూ ఓటమి భయంతో కూటమి కుట్రలు చేసింది. గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనగాని రవికి ఆధిక్యం వచ్చి, 31 ఓట్ల స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికారులు తాత్సారం చేశారు. ఫలితం ప్రకటించకుండా జాప్యం చేశారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)