Breaking News

హైదరాబాద్‌-విశాఖ విమానం ‘యూటర్న్’‌

Published on Wed, 10/29/2025 - 09:41

సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవన​ం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానం ల్యాండింగ్‌ కాకుండానే తిరిగి వచ్చేసింది.

వివరాల ప్రకారం.. ఎయిర్‌ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్‌ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ కాలేదు. దీంతో, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపారు. అనంతరం, హైదరాబాద్‌ విమానం సేఫ్‌గా ల్యాండింగ్‌ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)