Breaking News

గుంటూరు జీజీహెచ్‌ సూపరిటెండెంట్ ఓవరాక్షన్‌.. సీనియర్‌ డాక్టర్ల ఆగ్రహం

Published on Tue, 10/29/2024 - 13:44

సాక్షి,గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సూపరింటెండెంట్ ఎస్‌ఎస్‌వీ రమణ ఓవరాక్షన్ చేశారు.  కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించకపోయినా తానే సూపరింటెండెంట్‌ అంటూ ఎస్‌ఎస్‌వీ రమణ హడావిడి చేశారు. అయితే ఎస్‌ఎస్‌వీ రమణ వ్యవహారంపై సీనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ రౌడీ షీటర్‌  నవీన్‌ చేతిలో హ త్యకు గురైన మృదుల సహానా కేసు విషయంలో ప్రభుత్వం చెప్పింది చేయలేదని కక్షగట్టి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్ కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. కిరణ్‌ కుమార్‌ స్థానంలో ఎస్‌ఎస్‌వీ రమణను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. కొత్త సూపరింటెండెంట్ నియామకంపై డీఎంఈ.. జీజీహెచ్‌కీ సమాచారం ఇవ్వలేదు.

రౌడీషీటర్‌ నవీన్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్ప­టికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీ­యూలో ఉంచి ఆస్పత్రి అధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్‌ చేతిలో దారు­ణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేప­ట్టారు.

దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యు­లను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్‌ నవీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు.

ఆమెకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమా­ర్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికా­రులు భావించారు. ఆ మేరకు జీజీ­హెచ్‌ సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌­కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీ­లించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్‌ ఎం­డగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై సీరియస్‌ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)