Breaking News

ఏపీ: మత్స్యకారులకు గుడ్‌ న్యూస్‌..

Published on Fri, 05/14/2021 - 09:40

సాక్షి, అమరావతి: అలలతో పోటీపడుతూ నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేటనిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక చేయూతనిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 1,19,875 కుటుంబాలకు రూ.130.46 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

2019లో 1.02 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.102 కోట్లు ఇవ్వగా, 2020లో 1.09 లక్షల కుటుంబాలకు రూ.109 కోట్లు సాయమందించారు. ఈ ఏడాది మొత్తం 1,19,875 మందిని అర్హులుగా తేల్చగా ఇందులో బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. వలంటీర్ల ద్వారా ఇంకా అర్హులెవరైనా ఉన్నారేమోనని ప్రభుత్వం గుర్తిస్తోంది. కాగా ఈ నెల 18న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

చదవండి: కోవిడ్‌ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్‌ జగన్‌   
వ్యాక్సిన్ల కోసం  గ్లోబల్‌ టెండర్లు 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)