Breaking News

మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి

Published on Sun, 04/06/2025 - 04:38

మంగళగిరి: ఇటీవల అమరావతి పరిధి­లో డ్రగ్స్‌ అమ్మకాలు పెరిగిపోయాయి. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొకైన్‌ వంటి డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గంజాయి అయితే అన్నిచోట్లా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మంగళగిరిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక మహిళ దారుణ హత్యకు గురికాగా... ఇప్పుడు అక్కడికి కొద్ది దూరంలోనే ఏకంగా డ్రగ్స్‌ విక్రయి­స్తూ యువకులు దొరకడంతో అమరావతి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

నలుగురి అరెస్ట్‌... విజయవాడ కృష్ణలంకకు చెందిన నందం నిఖిల్, రాణిగారితోట­కు చెందిన బొట్ల కాశీవర్ధన్‌ అనే యువకులు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని ఎర్ర­బాలెం డిలైట్‌ డాబా సెంటర్‌ వద్ద కొకైన్, గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా... మంగళగిరి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని 8.71 గ్రాముల కొకైన్, 1,200 గ్రాము­ల గంజాయి, బైక్‌ను స్వాధీ­నం చే­సు­కుని అరెస్ట్‌ చేశారు.

వారిని విచారించగా, తమ­కు కృష్ణలంకకు చెందిన పెండ్యాల సా­యి­కుమార్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన గొర్ల గిరీష్‌రెడ్డిలు కొకైన్, గంజాయి విక్రయిస్తారని చె­ప్పారు. సాయికుమార్, గిరీష్‌­రెడ్డిలను కూడా అరె­స్ట్‌ చేసి విచారించగా..వారికి విజయవాడకు చెంది­న సొ­హైల్, శామీర్‌లు కొకైన్‌ గంజాయి విక్రయి­స్తా­రని తెలిపారు. పరారీలో ఉన్న సొ­హైల్, శామీర్‌­ల కో­సం గాలిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ను అరికట్టేందు­కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి­న ‘ఈగల్‌’ విభాగం ఐజీ ఏకే రవికృష్ణ శ­ని­వారం మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నింది­తులను విచారించారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)