Breaking News

అన్నదాతపై ‘మురసు’ పిడుగు

Published on Wed, 11/04/2026 - 05:33

సాక్షి, అమరావతి: అర్నబ్‌ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోక ముందే ‘మురసు’ రూపంలో విరుచుకుపడిన మరో తుపాను అన్నదాతను కోలు­కోలేని దెబ్బతీసింది. అర్నబ్‌ తుపాను దెబ్బకు ఉత్త­రాంధ్ర మొదలు కోస్తాంధ్ర వరకు కకావికల­మైన రైతులు మురసు దెబ్బకు విల­విల్లాడిపోతు­న్నారు. అర్నబ్‌ తుపాను దెబ్బకు నేలకొరిగిన పంట చేలను నిలబెట్టుకునేందుకు, ముంపునకు గురైన చేలల్లో నీటిని బయటకు తోడుకునేందుకు రైతులు పడ­రాని పాట్లుపడు­తున్నారు. పొట్టదశలో ఉన్న పంట అంతా నేలపాల­వడంతో కన్నీరుము­న్నీ­ర­య్యారు. నేల­కొరిగిన పంటను ఒబ్బిడి చేసుకు­నేందుకు నానా­తంటాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమ­యంలో కుంభవృష్టిని తలపించేలా కురు­స్తున్న వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమే­శాయి.

ఆరంభం నుంచీ రైతులకు తిప్పలే
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి ముగిసే వరకు తీవ్రమైన లోటు వర్షపాతంతో రైతులు సమతమతమయ్యారు. కరువు దెబ్బకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలే సాగవలేదు. సాగైన చోట కూడా సగానికి పైగా పంటలు తీవ్రమైన నీటి ఎద్దడితో ఎండిపోయి పచ్చని చేలన్నీ బీడులను తలపించాయి. వర్షాభావం, సాగునీటి ఎద్దడి వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గోదావరి, కృష్ణా డెల్టాల్లో సాగైన పంటలను వరుస విపత్తులు దెబ్బతీస్తున్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కొంతమేర దెబ్బతినగా, పంట చేతికొచ్చే దశలో  వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపానులు అన్నదాతల ఆశలను చిదిమేశాయి.  

దెబ్బ మీద దెబ్బ
ఖరీఫ్‌లో 37.33 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. దాంట్లో 26 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే సాగైంది. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అర్నబ్‌ తుపాను దెబ్బకు అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేలల్లో మొల లోతు నీరు నిలిచిపోయింది. పొట్ట దశకు చేరుకున్న వరిచేలు ముంపు నీటిలో చిక్కుకుని కుళ్లిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే అర్నబ్‌ తుపాను ప్రభావానికి 9.38 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్టుగా  ప్రకటించారు. 

కాగా.. క్షేత్ర స్థాయిలో 12 లక్షల ఎకరాలకు పైగానే పంటలకు భారీగా నష్టం వాటిల్లి­నట్టు రైతులు చెబుతున్నారు. అర్నబ్‌ తుపాను నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మురసు ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తుపాను ఏఎస్‌ఆర్, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. 

ఆ జిల్లాల్లో లక్షలాది ఎక­రాల్లో వరితోపాటు మిరప, పత్తి, కంది, మొక్క­జొన్న, పత్తి, మినుము, అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయ పంటలన్నీ ఎందుకూ పనిరాకుండా దెబ్బతిన్నాయి. మురసు తుపాను ప్రభావంతో మంగళవారం కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక లెక్కల ప్రకారమే దాదాపు 5 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 9వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరుస విపత్తులతో పెట్టుబడి­తో పాటు భారీగా ఉత్పత్తి నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలతో కోస్తా జిల్లాల్లోని ఆక్వా చెరువులకు ఆక్సిజన్‌ కొరతతో లక్షలాది ఎకరాల్లోని ఆక్వా చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి.

                     కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నేలవాలిన వరి పైరు 

పరిహారం ఇవ్వలేమంటున్న చంద్రబాబు
గతేడాది ఇదే సమయంలో దెబ్బతీసిన మోంథా తుపాను పరిహారం నేటికీ అందలేదు. కరువు సాయం ఊసెత్తడం లేదు. సెప్టెంబర్‌లో వర్షాల­తో పాటు అర్నబ్‌ తుపాను పంట నష్టం అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. తాజాగా మురసు తుపాను సాయం పరిస్థితి అంతే. పైగా కరువు జాబితాలో ఉన్నా సెప్టెంబర్‌ వర్షాలకు దెబ్బ­తిన్న పంటల జాబితాలో ఉంటే ఈ తాజా తుపా­నుల పంట నష్టం జాబితాలో వారి పేర్లు ఉండే చాన్స్‌ లేదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 

మరో­పక్క పంట చేలల్లో చేరిన నీటిని తొలగి­స్తామని, నేల­కొరిగిన పంటను నిలబెడతా­మని అని చెప్పి­న ప్రభుత్వం చివరకు ‘ఉప్పు ద్రావ­ణం పిచికారీ చేయండి.. ముంపునకు గురైన పంటలను కాపా­డుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇవ్వ­డమే తప్ప నష్టపోయిన రైతులకు పరిహా­రం ఇచ్చే దిశగా ఆలోచన చేయడం లేదు. ప్రభు­త్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరం లేదని రైతులు వాపోతు­న్నారు. ఏడా­దిలో అనావృష్టి.. అతివృష్టితో దెబ్బ­తిన్న తమను ఆర్థికంగా ఆదుకోకుండా ప్రభు­త్వం ప్రకటన­లతో సరిపెడుతోందని మండిపడుతున్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)