Breaking News

‘స్కిల్‌’ స్కామ్‌ సామాజిక, ఆర్థిక నేరం

Published on Sun, 09/10/2023 - 05:11

సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్‌ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్‌లో బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్‌లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది.

ఈ స్కిల్‌ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్‌ కంపెనీల కొనుగో­లుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్‌లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్‌ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.

రిమాండ్‌ తిరస్కరణ సరికాదు..
ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్‌ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్‌ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్‌ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్‌ సమయంలో మినీ ట్రయిల్‌ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది.

నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్‌ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)