Breaking News

వైఎస్సార్‌సీపీ నేతలపై కఠిన చర్యలొద్దన్న ఉత్తర్వులు పొడిగింపు

Published on Wed, 07/17/2024 - 06:18

సాక్షి, అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కఠిన చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు­లను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కల­గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పి­రెడ్డి, తలశిల రఘురాం, ప్రభుత్వ మాజీ సలహా­దారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్‌ తదితరులు హైకోర్టులో వేర్వే­రుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ కృపాసాగర్‌ గత వారం విచారణ జరిపారు.

పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల విచారణను గురువారం చేపట్టాలని కోరారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పిటిషనర్ల పాత్రపై ఆధారాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటి­షనర్లపై కఠిన చర్యలొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇతర నిందితులకు మధ్యంతర ఉత్తర్వులను వర్తింప చేయ­వద్దని వారు కోర్టును కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి స్పందిస్తూ.. గురువారం ఇతర కేసులున్నా­యని, ఆ రోజు వాదనలకు వీలుపడదని తెలిపారు. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేయా­లని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.

జోగి రమేష్‌ వ్యాజ్యంపై విచారణ  23కు వాయిదా
ఇదిలా ఉంటే, చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవపై నమోదైన కేసులో ముందుస్తు బెయిల్‌ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి విచారణ కూడా ఈ నెల 23కి వాయిదా పడింది. జోగి రమేష్‌పై కఠిన చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్‌ కృపాసాగర్‌ 23 వరకు పొడిగించారు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)