Breaking News

టీడీపీ నేతల అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న జోగి రమేష్‌

Published on Sun, 06/21/2026 - 18:43

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్‌ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్‌ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన  జోగి రమేష్‌.. జాయింట్ కలెక్టర్‌తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.

జోగి రమేష్‌తో ఫోన్‌లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్‌కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)