దుష్ప్రచారంలో దిట్ట

Published on Mon, 09/23/2024 - 05:56

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మతాన్ని, దేవుడిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడంలో సీఎం చంద్రబాబు ఆయన భజన బృందం దిట్ట. తన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఆయన ఏనాడూ ఉన్నతస్థాయి విచారణకు ముందుకురాలేదు. ఈ విషయంలో ఆయనపై మొదట నుంచీ విమర్శలున్నాయి. అలాగే, చంద్రబాబు హయాంలోనే అనేక అపచారాలూ చోటుచేసుకున్నాయని భక్తులు గుర్తుచేస్తున్నారు. ఉదా.. 

» తాజాగా.. చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి అంశం వెలుగుచూసింది. కానీ, ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అంటగడుతూ వివాదానికి తెరలేపారు.  

»    రెండేళ్ల క్రితం జగన్‌ సీఎంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు తిరుమల కొండపై శిలువ అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా రభస సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు బాధ్యులపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆ దు్రష్పచారానికి తెరపడింది.  

»   అలాగే, గత ఏడాది ఆగస్టులో కూడా తిరుమల కాలిబాటలో పులుల సంచారం వెలుగులోకి వస్తే భక్తుల భద్రతకోసం ప్రతి 250 మెట్లకు ఒక గార్డు చొప్పన 70 మందిని భక్తులకు కాపలా ఉంచేందుకు నిర్ణయించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భక్తులకు ఉచితంగా కర్రలను అందించాలని టీటీడీ సంకల్చిచింది. దీనినీ పచ్చ బ్యాచ్‌ వక్రీకరిస్తూ కర్రకు పది రూపాయలు రుసుం పెట్టి, టీటీడీ కర్రల వ్యాపారం చేసిందని పెద్దఎత్తున దు్రష్పచారం చేస్తే, అప్పట్లో టీడీపీయే దానిని  ఖండించుకుంది.  

»  ఇక అదే నెలలో తిరుపతి గోవిందస్వామి రాజస్వామి ఆలయ గోపురం అంశంలోనూ దు్రష్పచారమే చేశారు.  

» ఇలా తిరుమల ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ఇదే తరహా దు్రష్పచారాలకు పచ్చమూకలు తెగబడ్డాయి.  

»   గత ఏడాది ఆగస్టులో కాణిపాకం ఆలయంలో పంచామృత అభిõÙకం టికెట్‌ ధర రూ.700 నుంచి రూ.5,000లకు పెంచకుండానే పెంచారంటూ దు్రష్పచారం చేశాయి.

బాబు హయాంలోనే దుర్గగుడిలో క్షుద్ర పూజలు..
ఇక పవిత్ర పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని తరచూ పూజల్లో పాల్గొనే చంద్రబాబు గత కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన విజయవాడలో దాదాపు 30 గుళ్లను నేలమట్టం చేశారు. ఆ విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో తరలించి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆలయ గర్భగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లు వీడియోలు కూడా బయటకొచ్చాయి.  

»  అంతేకాదు.. 1995–2004 మధ్య 1472 సంవత్సరం నాటి తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసిన ఘటన కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)