Breaking News

తుపాను మురసు ఎఫెక్ట్‌.. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం

Published on Tue, 11/03/2026 - 07:08

మురసు తుపాన్‌ బీభత్సం అప్‌డేట్స్‌... ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మురసు తీరం దాటింది. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి.

రేపు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవు

  • మురసు తుపాన్‌ ఎఫెక్ట్‌తో రేపు విద్యాసంస్థలకు సెలవు
  • ఒంగోలు కొత్తపట్నంలో మురసు తుపాన్‌ బీభత్సం
  • భారీ వర్షాలకు నీట మునిగిన పలు కాలనీలు
  • ఇళ్లలోకి భారీగా చేరిన వరద, బాధితుల అవస్థలు
  • ఈదురుగాలుల ధాటికి పలు పూరిళ్లు ధ్వంసం
     

విజయవాడ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

  • మురసు తుఫాన్ కారణంగా ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
  • విజయవాడ నగరంలోని రహదారులన్నీ జలమయం
  • పోరంకి, తాడిగడప, కానూరు ,ఆటోనగర్, పటమట , బెంజిసర్కిల్ వరకూ నీటితో నిండిపోయిన బందర్ రోడ్డు
  • విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వర్షం తగ్గకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు

పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు

  • పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు
  • మన్యం, తూగో, పగో, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అత్యధిక శాతం భారీ వర్షాలు
  • నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఇంకా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక

 

గుంటూరు

  • మధ్యాహ్నం నుంచి గుంటూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం
  • చెరువులను తలపిస్తున్న ప్రధాన రోడ్లు
  • ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి రోడ్డు, కలెక్టరేట్ ఏటి అగ్రహారం, మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డులతో పాటు అన్ని ప్రధాన రహదారులు జలమయం
  • పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
  • మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం
  • భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • ప్రజలకు అత్యవసర సాయం అందించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • కంట్రోల్ రూమ్ నెంబర్లు 08744-241950, 9392919743
  • మురసు తుఫాను నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ అంకిత్

ఆటోపై కూలిన భారీ వృక్షం
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో యూనియన్ బ్యాంకు వద్ద ఈదురుగాలుల దాటికి భారీ వృక్షం ఆటోపై కూలిపోయింది. ముర‌సు తుపాను ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ప‌డిపోవంతో క‌రెంట్ స‌ర‌ఫరాకు అంత‌రాయం క‌లిగింది. 

విశాఖ 

  • బలహీనపడిన మురసు తుఫాను
  • మరో 24 గంటలపాటు ప్రభావం కొనసాగే అవకాశం
  • ఈరోజు, రేపు దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
  • ఈరోజు రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడనున్న మురసు
  • నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, తూ. గో, పగో జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
  • తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
    -IMD

దక్షిణ కోస్తాంధ్రపై తుపాన్‌ ప్రభావం

  • పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు
  • మన్యం, తూ.గో, ప.గో, కోనసీమ, ఏలూరులో వర్షాలు
  • నెల్లూరు, కడప, నంద్యాలలో మోస్తరు వానలు
  • తీవ్ర వాయుగుండంగా బలహీనపడనున్న తుపాన్‌
     

గుంటూరు జిల్లా

  • పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో యూనియన్ బ్యాంకు వద్ద ఈదురుగాలుల దాటికి ఆటోపై కూలిన భారీ వృక్షం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ‌

  • జిల్లాపై భారీగా పడిన మురుసు తుఫాన్ ప్రభావం
  • ఏకధాటిగా కురిసిన వర్షం
  • లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు

చీరాల మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు వాయిదా

  • మురసు తుపాన్‌ ఎఫెక్ట్‌తో కౌంటింగ్‌ వాయిదా
  • ఈ నెల 6వ తేదీన చీరాల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

మురసు తుపాను ప్రభావంతో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు
  • మన్యం, తూగో, పగో, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు
  • నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు
  • ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ
  • పొంగిపొర్లే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు
  • భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు  జాగ్రత్తలు తీసుకోండి
  • దక్షిణ కోస్తాంధ్రపై తీవ్రతుపాను మురసు
  • గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిమీ వేగంతో కదులుతుంది
  • బాపట్లకు 40కిమీ, ఒంగోలుకు 50కిమీ,  విజయవాడకు 90 కిమీ,
  • కావలికు 110కిమీ, మచిలీపట్నంకు 120కిమీ దూరంలో ఉంది
  • మురుసు క్రమంగా తుపాను, తీవ్రవాయుగుండంగా బలహీనపడే అవకాశం
  • రాత్రి నంచి ఈదురుగాలులు తగ్గే అవకాశం ఉంది
  • అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

గుంటూరులో భారీ వర్షం

  • ఉదయం నుంచి కాకుండా కురుస్తున్న వర్షం
  • పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, రోడ్లన్నీ జలమయం

కృష్ణాజిల్లా..

  • మురసు తుఫాన్ కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు.
  • సింగపూర్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కడప సర్వీసులు రద్దు.

ప్రకాశం

  • మురసు తుఫాను భీభత్సం
  • కొండేపి టంగుటూరు రోడ్దుపై  విరిగిపడ్డ  భారీ వృక్షాలు రాకపోకలకు అంతరాయం
  • సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో కొల్లాం-వైజాగ్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
  • ఇబ్బందుల్లో ప్రయాణికులు
  • నిడమానూరు ఉప్పలపాడు రోడ్దుకి అడ్దంగా పడిన వృక్షాలు
  • ఒంగోలు నిడమానూరు మధ్య నిలిచిన రాకపోకలు

విశాఖ..

  • పూర్తిగా తీరం దాటిన మురసు తుపాను..
  • ఒంగోలు సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటన..
  • పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీన పడనున్న తుఫాను..
  • మరో 24 గంటలపాటు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్న అధికారులు..

ఏలూరు జిల్లా

  • తుపాను కారణంగా ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు.
  • వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు నేడు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

👉ఇక, తుపాను కదలికలను ఆర్టీజీఎస్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షించాయి. తుపాను తీరం దాటినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు హెచ్చరించారు. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు.

👉ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏ సమయంలోనైనా 9552300009 నంబర్‌కు లేదా మన మిత్ర ద్వారా సమాచారం అందించాలని కోరారు.

  • మురసు తుపాన్‌ కారణంగా నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే..
  • ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ ,
  • బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీ ,
  • ప్రకాశం(జి) త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ ,
  • చిలకపాడులో 104.50 మిమీ, సంతనూతలపాడు 98.7మిమీ,
  • పశ్చిమగోదావరి (జి) మొగల్తూరులో 96మిమీ,
  • కోనసీమ(జి)  మలికిపురం 93.7మిమీ వర్షపాతం నమోదు.

ఇదీ చదవండి: మా ఓటు మేమే వేసుకునే హక్కు లేదా?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)