Breaking News

ముంచుకొస్తున్న అర్నాబ్‌.. రెండు రోజులు విద్యాసంస్థలు బంద్‌

Published on Mon, 10/26/2026 - 06:55

అర్నాబ్‌ తుపాను అప్‌డేట్స్‌.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్‌’ తుపానుగా బలపడనుండటంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 28న 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నేడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. 

  • తీవ్ర తుఫానుగా బలపడిన అర్నాబ్..
  • కొద్ది గంటల్లో అతి తీవ్రతుఫానుగా బలపడనున్న అర్నాబ్
  • బుధవారం మధ్యాహ్నం నాటికి యానాం సమీపంలో తీరం దాటే అవకాశం
  • గడిచిన 6 గంటల్లో 18కిమీ వేగంతో తీరం వైపుకి కదిలిన అర్నాబ్ తుఫాను
  • తుపాను ప్రభావంతో అల్లకల్లోలంగా మారుతున్న తీర ప్రాంతాలు

  • విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు

  • ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు


విజయవాడ

రేపు దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

  • ​తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేపు ఘాట్ రోడ్డు మూసివేత
  • ​ఘాట్ రోడ్డుపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత
  • ​భక్తుల రాకపోకలకు మహామండపం మార్గం మాత్రమే అనుమతి 
    – దుర్గగుడి ఈవో వి.కె. శీనానాయక్

ఎన్టీఆర్ జిల్లా 

కలెక్టర్ డా.జి.లక్ష్మీశ కామెంట్స్‌

  • అర్నాబ్ తుపాన్ దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తం  
  • తుపాన్ కారణంగా ఈనెల 28న భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు రోడ్డు ప్రయాణాలు మానుకుని ఇళ్లలోనే ఉండాలని సూచన
  • కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావాలి
  • జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటన
  • జిల్లా వ్యాప్తంగా పడవలు, టూరిస్ట్ బోట్ల రాకపోకలు, గేమ్ పార్కులు పూర్తిగా బంద్
  • విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, చెట్ల వద్దకు ఎవరూ వెళ్లవద్దు.. శిథిల భవనాల్లో ఆశ్రయం పొందరాదు
  • కోసిన ధాన్యాన్ని రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
  • తుపాన్‌ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు
  • కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454 ఏర్పాటు

ఈ రోజు సాయంత్రానికి  తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం

  • 15 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్‌
  • విశాఖకు 610, కాకినాడకు 690 కి.మీ, బాపట్లకు 860 కి.మీ దూరంలో తుపాన్‌ కేంద్రీకృతం
  • ఎల్లుండి బాపట్ల-విశాఖ మధ్య తీరందాటే అవకాశం
  • తీరం దాటే సమయంలో 140 కి.మీ వేగంతో గాలులు
  • ప్రధాన పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

ఏయూలో ఆన్‌లైన్‌ క్లాసులు..

  • విశాఖ..
  • అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్..
  • కీలక నిర్ణయం తీసుకున్న ఏయూ అధికారులు..
  • వారం రోజులపాటు ప్రత్యక్ష తరగతులు రద్దు..
  • ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు..
  • తుపాను హెచ్చరికల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ వెల్లడి..

విశాఖ..

  • కోస్తాంధ్రకు అర్నాబ్ తుపాన్‌ గండం..
  • సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాతంలో తీవ్ర తుఫానుగా అర్నాబ్..
  • అతి తీవ్ర తుపానుగా ఈనెల 28న మధ్యాహ్నం సమయంలో తీరం దాటే అవకాశం.
  • కోనసీమ, కాకినాడ జిల్లాలకు పెరుగుతున్న ముప్పు.
  • తీరం దాటే సమయంలో 2.5 మీటర్ల ఎత్తున ఉప్పెన సంభవించే ప్రమాదం.
  • అర్నాబ్ తీవ్ర తుపానుగా మారి తీరానికి వచ్చే 6 గంటలు ముందు గరిష్ట స్థాయికి చేరనున్న గాలులు ఉధృతి.
  • గరిష్టంగా 140 కి.మీ వేగంతో గాలులు.
  • కుంభవృష్టి వర్షాలతో అర్బన్ ఫ్లడ్ ముప్పు, లోతట్టు ప్రాంతాలు జలమయం, కొండచరియలు విరిగి పడే ప్రమాదం..
  • అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ..

రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్‌

  • కాకినాడ జిల్లా
  • కలెక్టర్ హరేంధర్ ప్రసాద్‌ కామెంట్స్‌..
  • తుపాన్‌ కారణంగా జిల్లాలో రేపు, ఎల్లుండి విద్యా సంస్థలుకి సెలవు ప్రకటించాం
  • అర్నాబ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్న 80వేల మందిని అప్రమత్తం చేశాం
  • ఆరు తీర ప్రాంత మండలాలతో పాటు మరో ఐదు మండలాలలో అప్రమత్తంగా ఉన్నాము
  • జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం..
  • తీర ప్రాంత ప్రజలను అక్కడికి తరలిస్తాం
  • 6,452 బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేశాం
  • ఆసుపత్రుల్లో పవర్ కట్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాము
  • ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.
  • కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం..
  • ఉద్యోగులు సెలవులు రద్దు చేశాము
  • అవసరం లేని ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకోవాలి

 

అర్నాబ్‌ ఎఫెక్ట్‌.. సముద్రం అల్లకల్లోలం

  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
  • అర్నాబ్ తుఫాను ప్రభావంతో అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో పెరిగిన అలల ఉధృతి
  • భారీగా కోతకు గురవుతున్న సముద్ర తీరం.
  • భయాందోళనలో తీర ప్రాంత ప్రజలు.

ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన.
  • తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
  • 'అర్నాబ్' తుపానుగా నామకరణం
  • గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్
  • ప్రస్తుతానికి  విశాఖపట్నంకు 650 కి.మీ, కాకినాడకు 730 కి.మీ, మచిలీపట్నంకు 830 కి.మీ, బాపట్లకు 910 కి.మీ దూరంలో 
    కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్‌గా బలపడనున్న అర్నాబ్‌
  • ఎల్లుండి ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
  • ఈ మూడు రోజులు అత్యంత కీలకం
  • ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
  • రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడి. 

 

విద్యాసంస్థలకు సెలవులు..

  • ఒడిశాలో రెడ్‌ అలర్ట్‌
  • ఒడిశాలో 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
  • గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయనున్నారు.
  • 225 అగ్నిమాపక బృందాలు సిద్ధం
  • ఒడిశాలో సహాయక చర్యల కోసం 225 ఫైర్‌ సర్వీస్‌ బృందాలతో పాటు 60 ODRAF, 17 NDRF బృందాలను అప్రమత్తం చేశారు.
  • అక్టోబర్ 28న గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు.
  • మత్స్యకారులకు హెచ్చరిక
  • సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. 
     

నేడు పలు జిల్లాల్లో వర్షాలు..

  • తీవ్ర వాయుగుండం  సోమవారం ఉదయానికి తుపానుగా,

  • మంగళవారం ఉదయానికి  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,

  • బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

  • సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

  • అర్నాబ్‌ తుపాను ముప్పు ముంచుకొస్తోంది.

  • అత్యంత తీవ్రంగా మారనున్న తుపాను  

  • కోస్తా ప్రాంతమంతటా ప్రభావం

  • 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు  

  • 28న అతి భారీ వర్షాలకు అవకాశం  

  • కాకినాడ, యానాం సమీపంలో తీరం దాటొచ్చని అంచనా

  • తుపాను కారణంగా 28వ తేదీన 12 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

  • బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా ఉన్నా..

  • అంతకంతకూ బలపడి సోమవారానికి తుపానుగా మారనుంది.

  • ఆ తర్వాత కూడా ఇది తీవ్ర, అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందన్న వాతావరణశాఖ

  • తుపానుగా మారాక దీన్ని అర్నాబ్‌గా పిలుస్తారు. 

👉ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య కాకినాడ, యానాం వద్ద అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960, మచిలీపట్నానికి 1,060, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

28న 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ 
👉తుపాను ప్రభావంతో ఈ నెల 28న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తేదీన కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌  జారీచేశారు.

👉ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల 27వ తేదీన 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27 ఉదయం నుంచి రాష్ట్ర తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 60 నుంచి 70, సాయంత్రానికి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని వాతావరణశాఖ తెలిపింది. 28న ఉదయానికి గాలులు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

కాకినాడ, యానాం వద్ద అలల ముంపు ప్రమాదం 
👉తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ, యానాం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో సాధారణ సముద్రమట్టానికి అదనంగా 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తువరకు సముద్రపు నీరు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో సముద్రం ఈ నెల 28న అత్యంత ప్రమాదకరస్థితికి చేరవచ్చని పేర్కొంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ–ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావిత తీరప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కోరింది.  

ఇదీ చదవండి: రాజధాని పనులపై పెత్తనం మళ్లీ సింగపూర్‌ సంస్థకే!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)