Breaking News

‘వుయ్‌ యాప్‌’పై కఠిన చర్యలు తీసుకోండి

Published on Mon, 05/13/2024 - 05:42

సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన ‘వుయ్‌ యాప్‌’పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. ఈ యాప్‌ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం ‘వుయ్‌ యాప్‌’పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే టీడీపీ ప్రత్యేకంగా ‘వుయ్‌ యాప్‌’ను రూపొందించిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే టీడీపీ వుయ్‌ యాప్‌ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం, డీజీపీలకు వైఎస్సార్‌సీపీ ఈ–మెయిల్స్‌ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ యాప్‌ పేరిట టీడీపీ అక్రమాలు కొన­సాగుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్‌ బాపట్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. 

⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం, ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా టీడీపీ ‘వుయ్‌ యాప్‌’ను రూపొందించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది. 
⇒ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, వయసు, చిరునామా, కులం, మతం, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆ యాప్‌లో పొందుపరిచింది. తద్వారా ఓటర్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోంది.  
⇒ ఓటర్ల కదలికలను నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ చేస్తూ వారి భద్రతకు ముప్పు తెస్తోంది.  
⇒  ప్రత్యేకంగా బార్‌ కోడ్‌లను ముద్రించిన ఓటరు స్లిప్పులు, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తోంది. అనంతరం నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెడుతోంది. ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఇతర మార్గాల్లో డిజిటల్‌ చెల్లింపులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)