Breaking News

సరికొత్త ప్రచారం!

Published on Sun, 01/12/2025 - 04:10

సాక్షి, అమరావతి :   వాట్సాప్‌ లేదా మెసేజ్‌లు తెరవగానే ప్రెస్టేజ్‌ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్‌ మెసేజింగ్‌పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్‌లతో పోలిస్తే బిజినెస్‌ మెసేజ్‌లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్‌ మెసేజింగ్‌ను ఎంచుకుంటున్నాయి. 

ఆర్టి­ఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రాకతో బిజినెస్‌ మెసేజింగ్‌ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభి­రుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్‌ కమ్యూనికేషన్స్‌ సర్విసెస్‌ (ఆర్సీఎస్‌), జెనరేటివ్‌ ఏఐ, చాట్‌బోట్‌ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్‌ మెసేజ్‌లు, ఇతర మెసేజ్‌లతో పోలిస్తే ఈ బిజినెస్‌ మెసేజ్‌లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్‌ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్‌ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి.  

రూ.26 వేల కోట్ల మార్కెట్‌
దేశీయ బిజినెస్‌ మెసేజింగ్‌ మార్కెట్‌ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్‌ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్‌ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్‌ బోట్స్‌ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్‌ మెసేజింగ్‌ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్‌ ఏఐపై ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్‌ మెసేజింగ్‌ మార్కెట్‌లో 50 శాతం        వాటాను వాట్సాప్‌ అందిస్తున్న ఆర్సీఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్‌ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)