Breaking News

3 రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం

Published on Wed, 11/19/2025 - 04:49

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజులు హైదరాబాద్‌లో ఉండి మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్లారు. గత శనివారం ఆయన విశాఖలో సీఐఐ సమిట్‌ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లారు. తన నివాసంలో మంగళవారం వరకూ బసచేశారు. 3 రోజుల తర్వాత మంగళవారం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో తన తనయుడు, మంత్రి లోకేశ్‌తో కలిసి పుట్టపర్తి చేరుకున్నారు. 

ఇద్దరూ రాత్రి పుట్టపర్తిలో బసచేశారు. ప్రధాని మోదీతో కలిసి బుధవారం ఉదయం శ్రీసత్యసాయి శత జయంతి సందర్భంగా నిర్వహించే మహిళా దినోత్సవంలో పాల్గొంటారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ బెంగళూరు నుంచి మంగళవారం రాత్రి కారులో బయల్దేరి నేరుగా పుట్టపర్తికి చేరుకుంటారు. అలాగే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా మంగళవారమే పుట్టపర్తికి రావాల్సి ఉండగా.. ఆయన కార్యక్రమం వాయిదా పడింది. 

ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎంతో కలిసి హైదరాబాద్‌ నుంచి పుట్టపర్తి చేరుకున్న మంత్రి లోకేశ్‌ 

వీకెండ్స్‌ హైదరాబాద్‌లోనే.. 
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు.. మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ గత వారాంతం కూడా హైదరాబాద్‌లోనే గడిపారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముగ్గురి హైదరాబాద్‌ పర్యటనల సంఖ్యలు 80, 83, 104కు చేరాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు, 2019లో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు 2022 వరకు  హైదరాబాద్‌లో తలదాచుకున్నారనే విమర్శలున్నాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)